prakash spiritual
తెలుగు: కృష్ణా..జీవుడు ఉదయం లేచింది మొదలు ప్రకృతిలోని ఎన్నెన్నో అందాలను తిలకిస్తూ.. ఏవేవో అనుభూతులను పొందుతున్నాడు.
English: Krishna..when the living being wakes up in the morning, he is enjoying many beauties of nature..he is getting some sensations.

తెలుగు: కృష్ణా..జీవుడు ఉదయం లేచింది మొదలు ప్రకృతిలోని ఎన్నెన్నో అందాలను తిలకిస్తూ.. ఏవేవో అనుభూతులను పొందుతున్నాడు.వాటన్నిటినీ మనసు పొరల్లో చిత్రీకరించు కుంటున్నాడు.వాటిలో ఎన్నిటినో తనకు అన్వయించుకొని సొంత కలల సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటున్నాడు. బాహ్యంగా జీవుడు అమరావతి వెళ్లాలంటే ఆ వాహనానికి టికెట్ తీసుకోవాలి. అదే కలలో అయితే అమరావతే కాదు ముంబాయి..అమెరికా.. ఇలా ఎక్కడికైనా సరే టికెట్ లేకుండా క్షణకాలంలో వెళ్ళిపోతున్నాడు. స్థూల వస్తువులకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది.అదే స్వప్నంలో అయితే ఏ ఫీజులు ఉండవు. కలలో ఎక్కడికి కావలిస్తే అక్కడకు వెళ్ళిపోతూ వాటిని అనుభవిస్తుంది.. తానే..కానీ అవన్నీ కల్పన. కల చేదరగానే ఆ కల్పనలన్నీ మాయమైపోతున్నాయి కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)
English: Krishna..when the living being wakes up in the morning, he is enjoying many beauties of nature..he is getting some sensations. He is painting all of them in layers of the mind. If a living being wants to go to Amravati externally, he has to take a ticket for that vehicle. In the same dream, not Amravati, but Mumbai..America .. He is going anywhere like this in a moment without a ticket. Gross goods have to pay value.In the same dream however there are no fees. Go anywhere in the dream and experience them .. by itself .. but everything is fiction. God, are all those fantasies disappearing when the dream is shattered .._UdayKiran Golla(Bandarulanka)

prakash spiritual
తెలుగు: కృష్ణా.. జీవులకు మాత్రమే రాత్రి ఉంటుంది.
English: Krishna .. There is only night for living beings.
తెలుగు: కృష్ణా.. జీవులకు మాత్రమే రాత్రి ఉంటుంది. వెలుగులు విరజిమ్మే సూర్యునికి రాత్రి ఉంటుందా. సూర్యాస్తమయం అయ్యింది. పాపం సూర్యుడు రాత్రికి ఇంట్లో పద్మిని.. ఛాయా..ఉషా..సౌమ్యలతో ఎన్ని భాధలు పడుతున్నాడో..అనే ఊహలు వద్దు.సూర్యుడికి ఏమైనా ఇల్లు ఉంటుందా.అసలు యధార్ధానికి సూర్యునికి అస్తమయం.. ఉదయం ఉంటాయా.సూర్యాస్తమయం అయ్యిందంటే చాలు జీవులు నిద్రావస్థలోకి జారుకుంటాయి.జీవుడి నిద్రావస్థలో..నేను..అనేది మాత్రం పడుకోదు. పనిచేసే ఇంద్రియాలు మాత్రమే పడుకుంటాయి. అలాగే జీవుడిలో ఉండే పురుషుడికి కూడా నిద్ర ఉండదు కాదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)

English: Krishna .. There is only night for living beings. Will it be night for the sun to shine. It was sunset. Sadly, the sun is shining in the house at night Padmini .. Chhaya .. Usha .. Do not want to imagine how much pain .. suffering from the sun. .Is not going to lie. Only the working senses sleep. Also, even a living man does not have sleep, God .._UdayKiran Golla(Bandarulanka)

prakash spiritual
తెలుగు: కృష్ణా..పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు.
English: Krishna..where is God.
తెలుగు: కృష్ణా..పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు. నాలోను.. నీలోను..మనిద్దరి మధ్య కూడా ఉన్నది ఆయనే.పరమాత్ముడు వస్తురూపం అయితే ఏ ఒక్క దానికో పరిమితం అవుతాడు. తత్వస్వరూపం అయిన పరమాత్మ ఆన్నిటా నిండి నిబిడీకృతమై ప్రకాశిస్తున్నాడు. జీవుడి లోపల మాత్రమే పరమాత్ముడు ఉన్నాడనుకుంటే పొరపాటు. అందుకే విచారణ చెయ్యి నిర్ధారించుకుని సత్యాన్ని తెలుసుకోమంటుంది శాస్త్రం. నశించిపోయే క్షరప్రకృతి జీవుడి శరీరం.. నాశనం కాని అక్షర ప్రకృతి జీవుడిలోని..నేను.. అదే ఆత్మచైతన్యం.ఆ..నేను..ను తెలుసుకోవడమే జీవుడికి జీవిత పరమార్ధం కావాలి కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)

English: Krishna..where is God. He is the one who is in me .. in you .. even between all of us. The philosophical God is all-pervading, all-pervading and all-pervading. It is a mistake to think that God exists only within the living entity. That is why science wants to investigate and make sure to know the truth. The body of the perishable alkaline creature .. in the non-perishable alphabet nature creature..I .. the same self-consciousness.that..I ..Does God need to know the meaning of life?_UdayKiran Golla(Bandarulanka)