prakash spiritual
తెలుగు: కృష్ణా..కంటికి కనిపించని గాలికి ఎంతటి శక్తిని ఇచ్చావయ్యా.
English: Krishna..how much power did you give to the air which is invisible to the eye.

తెలుగు: కృష్ణా..కంటికి కనిపించని గాలికి ఎంతటి శక్తిని ఇచ్చావయ్యా.ఈ ప్రకృతిలోని సమస్తము గాలి వల్లే కదులుతున్నాయి.చివరకు నీరు ప్రవహించాలన్నా అందులో గాలి ఉండాల్సిందే.ఆ చెట్టు కదలడం లేదు. దాని ఆకులు మెదలడం లేదు. అసలు గాలే వీయడం లేదు. ఎక్కడికి పోయిందో అంటుంటారు. సృష్టిలో గాలి లేకపోవడం అనేది ఉండదు.చెట్లను ఆకులను కదప గలిగినంత గాలి లేదక్కడ అంతే.వాయువు లేకపోతే జీవులు బతకగలవా. అటువంటి గాలికి ఆకాశమే ఆధారమై తనలో ఇముడ్చుకుంటుంది. చివరకు ఆకాశం కూడా నీ మాయలో లీనమైపోతుంది కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)
English: Krishna..how much power did you give to the air which is invisible to the eye. Everything in this nature is moving due to the wind. Its leaves do not bud. The original gale is not blowing. Say where it went. There is no lack of air in creation. There is not enough air to move the trees and leaves. The sky is the basis for such air. Eventually the sky will also be immersed in your magic, God .._UdayKiran Golla(Bandarulanka)

prakash spiritual
తెలుగు: కృష్ణా..నీవు అవతార స్వ.. రూపుడవు.
English: Krishna..you do not form the incarnation self .. The mind becomes ecstatic when you think of your rasali with Radha.

తెలుగు: కృష్ణా..నీవు అవతార స్వ.. రూపుడవు. రాధతో నీ రాసలీల తలచుకోగానే మనసు పరవశించిపోతుంది. కృష్ణా.. నీవు భువిపైకి రాక ముందు దేవుడెవరయ్యా. ఉపనిషత్ ల కాలంలో దేవతా విగ్రహాలు..ఆలయాలు లేవు. పురాణకాలం నుంచే విగ్రహాలు.. గుడులు వచ్చాయి. కలియుగంలో జీవుల ఆయుర్దాయం తక్కువ. యధార్థాన్ని తెలుసుకోవడం కంటే పదార్థాల గురించి తెలుసుకోవడానికే మనసు మక్కువ చూపుతుంది. అటువంటి వారికి వేదాలు శాస్త్రాలు అంటే అంత త్వరగా అర్థం కాదు. సత్యమైనది ఏమిటో తెలుసుకునేందుకు మనసును సంసిద్ధం చేసేందుకు వేదాలను..ఉపనిషత్ జ్ఞానాన్ని రంగరించి వ్యాసమహర్షి మానవజాతికి మేలు చేసేందుకు త్వరగా అర్థం చేసుకునేందుకు పురాణాలు తీసుకువచ్చారు. నీ రాకకు ముందు వరకు అగ్ని హోత్రుడే దేవుడు.. యజ్ఞమే దైవం కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)
English: Krishna..you do not form the incarnation self .. The mind becomes ecstatic when you think of your rasali with Radha. Krishna .. God before you came to earth. During the Upanishads, there were no idols of gods or temples. Idols have been around since ancient times. The life span of living beings is short in Kali Yuga. The mind is more inclined to know about materials than to know reality. For such people the Vedas do not mean the sciences so quickly. The Vedas to prepare the mind to know what is true ..Vyasa Maharshi brought the Puranas to the forefront of knowledge for the benefit of mankind. God is the God of fire until before your arrival .. Is Yajna God, God .._UdayKiran Golla(Bandarulanka)

prakash spiritual
తెలుగు: కృష్ణా..నీ పేరు ఉంటే చాలయ్యా.
English: Krishna..if your name is enough.

తెలుగు: కృష్ణా..నీ పేరు ఉంటే చాలయ్యా. నీరూపం మదిలో మెదిలిందంటే చాలు..బ్రహ్మానందమే నీవంటే జ్ఞానబోధ చేసేందుకు..ప్రేమను పంచేందుకు భువిపై అవతరించావు. మరి నీవు రాక ముందు ఈశ్వరుడు ఎలా ఉన్నాడయ్యా.కృత.. త్రేతా యుగాల్లో జీవుల ఆయుర్దాయం ఎక్కువ.వారంతా మోక్షానికై వేదమాత గాయత్రి ఉపాసన.. సూర్యోపాసన..అగ్ని హోత్ర ఉపాసనలు చేసేవారు. కలియుగంలో జీవుడికి అంత సమయం..అంత బుద్ది.. ఓర్పు సహనం ఉండదు. అందుకే వేద వ్యాసుడు కర్మలను ఉపాసనలను జాగ్రత్తగా కూర్చి భక్తి కిందకు తీసుకువచ్చారు. అలా జీవుడిని భక్తి మార్గంలో నడిపించి జ్ఞాన మార్గంలో మోక్షం కల్పించేందుకే కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)
English: Krishna..if your name is enough. Neerupam is enough to meditate in the mind..Brahmanandame you are the one who came to earth to impart knowledge..to share love. And how did Ishvara exist before you came? In Kali Yuga, there is so much time for life .. so much intellect .. there is no endurance. That is why the Vedic Vyasa carefully composed the karmas and upasanas and brought them under devotion. Is it to guide the living being on the path of devotion and to bring salvation on the path of knowledge?_UdayKiran Golla(Bandarulanka)