prakash spiritual
తెలుగు: కృష్ణా..ప్రతి ప్రాణిలోను.. ప్రతి దేహంలోనూ..నేను..నేను.. నేను.. అని కొట్టుకుంటున్నది నీవే కదా.
English: Krishna .. in every living being .. in every body .. I .. I .. I .. are you the one who is beating.

తెలుగు: కృష్ణా..ప్రతి ప్రాణిలోను.. ప్రతి దేహంలోనూ..నేను..నేను.. నేను.. అని కొట్టుకుంటున్నది నీవే కదా.జీవుడి లోపల ఉండి ఆ స్పందించే తత్వమే పరమాత్ముడు.ఆ పరమాత్ముడు అంతటా నిండి ఉన్నందునే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మహర్షులు గుర్తించింది.జీవుడి లోపల నేను.. అనే ఉనికే సత్యం. జీవుడికి తెలిసినవి..తెలియనివి ఉంటున్నాయి.తెలుసు..తెలియదు అనే తెలివే జ్ఞానం.తల్లి గర్భంలో జీవుడు చేరినప్పుడు ఈ శరీరం లేదు.కానీ అప్పుడూ..నేను..అనేది ఉంది.తరువాత శరీరం వచ్చినప్పుడూ ఉంది.శరీరం పడిపోతే ఆయన వెళ్లిపోయారని అంటారు. నేను మాత్రం ఎక్కడికి పోదు.ఎప్పటికీ పోదు.కానీ ఏది వస్తుందో అదే కనుమరుగు అవుతుంది కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)
English: Krishna .. in every living being .. in every body .. I .. I .. I .. are you the one who is beating. The truth of existence. The living being knows..there are unknowns.The intelligent knowledge of knowing..knowing. When the living entity enters the mother's womb this body does not exist. I will not go anywhere. I will never go. But what comes will disappear, God .._UdayKiran Golla(Bandarulanka
)

prakash spiritual
తెలుగు: కృష్ణా..జీవుడు నిద్రలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు.
English: Krishna..the living being enjoys Brahmananda in sleep.

తెలుగు: కృష్ణా..జీవుడు నిద్రలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు.ఎందుకంటే నిద్రలో మనసు..బుద్ది పనిచేయవు.దేహం ఉన్నా జీవుడికి సంబంధం లేనట్టు పడి ఉంటుంది. ప్రాణం ఆడుతున్న జీవుడికి సంబంధం లేదు. పోనీ ఆ ఆనందాన్ని నీ భార్య ఇచ్చిందా..నీ భర్త ఇచ్చిందా.. నీ పిల్లలు..నీ పదవులు..నీ డబ్బు..నీ అంతస్తులు ఇచ్చిందా..అంటే కాదంటున్నారు. ఆనందానికి అవేమీ అక్కర్లేదు.ఊరుకుంటేనే జీవుడికి శాంతి.. ఊరిలో ఉన్నవన్నీ తలకు ఎక్కించుకుంటే అశాంతి. అంటే మనసు మేలుకుని ఉంటేనే అన్ని సమస్యలు కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)

English: Krishna..the living being enjoys Brahmananda in sleep.because the mind..the mind does not work in sleep.the body is lying as if it has nothing to do with it. Life has nothing to do with the playing creature. Pony, did your wife give you that happiness, did your husband give you, did you give your children, your positions, your money, your floors? Awemi does not want happiness. Peace be upon the living. That is, if the mind is awake, all the problems are God .._UdayKiran Golla(Bandarulanka)

prakash spiritual
తెలుగు: కృష్ణా..జీవుడు నిత్యం సత్వ.. రజో.. తమో గుణాలలో పడి కొట్టుకుపోవాల్సిందేనా.
English: Krishna .. the living being is always sattva .. rajo .. tamo kottukupovalsindena qualities.
తెలుగు: కృష్ణా..జీవుడు నిత్యం సత్వ.. రజో.. తమో గుణాలలో పడి కొట్టుకుపోవాల్సిందేనా.జీవుడు ప్రశాంతంగా ఉన్నాడంటే సత్వగుణంలో ఉన్నట్టే.కోరికలు..కోపం.. ఆవేశంలో ఉన్నాడంటే రజో గుణంలో ఉన్నట్టు. ఇక ఎప్పుడూ పడుకుని ఉండాలనుకోవడం తమో గుణం. జీవుడు ప్రశాంతం నుంచి.. కోరికల్లోకి అవి తీరో తీరకో.. నిద్రలోకి జారుకుంటూ ఆ మూడు అవస్తల్లోనే తిరుగుతుంటాడు.జాగృత అవస్థలో ఇంద్రియాలన్నీ పనులు చేసి అలసిపోతుంటాయి. బడలిపోయిన ఇంద్రియాలు విశ్రాంతిని కోరుకుంటాయి.అప్పుడు మనసు ఇంద్రియశక్తులను వెనక్కి తీసుకుంటుంది.అప్పుడు కోరికలపై మనసు దృష్టి పెడుతుంది. అవి కలల రూపంలో బయట పడతాయి. అందుకే ఆయా కలలను బట్టి వ్యక్తి జీవితం ఎలా నడుస్తుందో చెబుతున్నారు.ఆ తరువాత మనసు కూడా బడలిపోయి ఆ మనసు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అలా జీవుడు గాఢ నిద్రలో ఆత్మానుభూతిని పొందుతున్నాడు కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)

English: Krishna .. the living being is always sattva .. rajo .. tamo kottukupovalsindena qualities. If the living being is in sattva quality. Tamo attribute to always wanting to lie down. The living being goes from calm .. to the desires .. they fall asleep and wander in those three states. In the waking state all the senses are tired of doing things. The weakened senses seek rest. Then the mind withdraws the senses.Then the mind focuses on desires. They come out in the form of dreams. That is why it is said that a person's life runs according to those dreams. After that, the mind also changes and that mind goes into the soul. Is it possible for a living being to experience self-realization in deep sleep?_UdayKiran Golla(Bandarulanka)