prakash spiritual
తెలుగు: కృష్ణా..నేనెవరిని..ఈ ప్రశ్న అందరికీ రావాలి.
English: Krishna..Nenevarini..This question should come to everyone.

తెలుగు: కృష్ణా..నేనెవరిని..ఈ ప్రశ్న అందరికీ రావాలి. కానీ ఏ కొందరికో మాత్రమే వస్తుందంటే అది నీ మాయే కదా. ఈ ప్రపంచం అంతా ఆలోచనల మీదే ఆధారపడి ఉంది. కానీ జీవుడిలో ఉండే..నేను.. అనేది ఏ ఆలోచనల మీద ఆధారపడి లేదు. ఆ ఆలోచనల ఉనికికి మాత్రం..నేనే..కారణం. అంతెందుకు.. నేను.. అనేది దేనిమీద ఆధారపడదు..నేను..ఉంటేనే ఆ ఆలోచనలు పుడుతున్నాయి. జీవుడిలో..నేను..లేకపోతే ఆలోచనలు ఎక్కడివి. ఏ ఆలోచన లేకుండా జీవుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా..నేను..నేనుగా ప్రకాశిస్తుంది. జీవుడు ఉదయం లేచాడు అంటే మనసు పెట్టే పరుగులతో ఎన్నెన్ని ఆలోచనలు.ఆ ఆలోచనలకు పునాది మనసు అయితే.. పుట్టి పడిపోయే మనసుకు..నేను..మాత్రం సాక్షినే కదా ఈశ్వరా._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)
English: Krishna..Nenevarini..This question should come to everyone. But what only comes to a few is whether it is your Maya. This whole world depends on yours of ideas. But being alive..I .. is not based on any ideas. The reason for the existence of those thoughts .. myself .. After all .. I .. does not depend on anything .. I .. If there are those thoughts arise. In a living being..I..otherwise where are the thoughts. Even when the living being is in a deep sleep without any thought..I..shine myself. The creature wakes up in the morning with so many thoughts with mind-blowing runs.If the foundation for those thoughts is the mind .. the mind that is born and falls .. I .. am God the only witness._UdayKiran Golla(Bandarulanka)

prakash spiritual
తెలుగు: కృష్ణా..జీవుడు తన వారందరితో కలసి రాత్రి పడుకున్నాడు.
English: Krishna..jivu slept with all his friends at night.
తెలుగు: కృష్ణా..జీవుడు తన వారందరితో కలసి రాత్రి పడుకున్నాడు.ఆ నిద్రలో మనసు బుద్ధి పనిచేయడం లేదు. ఉదయం అవ్వగానే చుట్టూ అందరూ నిద్రలో ఉండగానే ఎవరో తట్టినట్టు జీవుడు లేచి కూర్చున్నాడు. అలా నిద్ర లేపింది ఎవరు.జీవుడు జన్మ పరంపరలో చేసుకున్న కర్మలు వాటి ఫలితాలు నిద్ర లేపుతున్నాయి.కొత్తగా కర్మలు చేయడానికే కాదు కర్మ ఫలితాలు అనుభవించేందుకు కూడా. కర్మలు జీవుడినే కాదు అతడిలోని మనో బుద్ధులను నిద్ర లేపుతుంది. జీవుడు ప్రారబ్ధ కర్మలనే కాదు జన్మ పరంపరలో పోగుచేసుకున్న సంచిత కర్మలను కూడా అనుభవించాలి కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)

English: Krishna..jivu slept with all his friends at night.in that sleep the mind is not working. As soon as it was morning everyone around was asleep and the creature woke up as if someone had knocked. Who woke up like that. The karmas performed by the living entity in the birth sequence wake up their sleep. Not only to perform new karmas but also to experience the karmic results. Karma is not only alive but also awakens the psychic Buddhas in him. Should a living being experience not only the initial karmas but also the accumulated karmas accumulated in the birth line?_UdayKiran Golla(Bandarulanka)

prakash spiritual
తెలుగు: కృష్ణా..దానధర్మాలు చేసిన వారెందరో సమాజంలో దరిద్రులుగా మిగులుతున్నారు.
English: Krishna..those who have done charity are left as poor in the society.

తెలుగు: కృష్ణా..దానధర్మాలు చేసిన వారెందరో సమాజంలో దరిద్రులుగా మిగులుతున్నారు. ఎంగిలిచేత్తో కాకిని కూడా తరమని పరమ లోభులు.. ఇతరుల ఆస్తులను అన్యాయంగా లాక్కున్న వారు ధనవంతులు అవుతున్నారు. ఇదేమి మాయ.దేవుడంటే ధర్మాన్ని.. ధర్మాత్ములను కాపాడాలి కదా.అధర్మపరులను కాపాడుతున్నాడు ఏమిటని నాబోటి భక్తులు ఎందరికో శంక.మాయాజూదంలో ఓటమి పాలైన పాండవులు వనవాసం చేస్తే.. రాజభోగాలు అనుభవించే దుర్యోధనుడికి కంటి మీద కునుకు లేదు. పాండవులు వనవాసంలో యజ్ఞయాగాదులు దానధర్మాలు చేస్తూ సుఖంగా జీవిస్తే..మళ్ళీ వారు వచ్చేస్తారేమొనని దుర్యోధనునికి బెంగ రావణుని వైభవం వర్ణించతరమా. అటువంటి వాడు సీతమ్మను ఎత్తుకెళ్లి ఆరు నెలల పాటు కంటి మీద కునుకు లేకుండా గడిపాడు.ఒక్కోసారి అధర్మం రాజ్యమెలుతుండ వచ్చు.అంతిమంగా ధర్మాన్ని భగవంతుడే గెలిపిస్తాడు కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)

English: Krishna..those who have done charity are left as poor in the society. The greedy ones who want to destroy even the crow with their beak .. Those who unjustly grab the property of others are becoming rich. This is Maya. God is the one who protects the righteous .. the righteous should protect the wicked. If the Pandavas live comfortably in the exile by performing rituals and performing rituals.Can Benga Ravana describe to Duryodhana the glory that they will come again? Such a man kidnapped Seetamma and spent six months without a twinkle in his eye._UdayKiran Golla(Bandarulanka)