prakash spiritual
తెలుగు: కృష్ణా.. ఈ శరీరత్రయం నేను కాదు.
English: Krishna .. This body is not me.

తెలుగు: కృష్ణా.. ఈ శరీరత్రయం నేను కాదు. అదే స్థూల సూక్ష్మ కారణ శరీరాలను నేను కాదు. మరి.. నేనెవరిని.. మాంసం శుక్ల హస్తి..ఎముకలు ఇంద్రియాలు అన్నిటితో స్థూల శరీరం ఉంది. ప్రాణం బుద్ది చిత్తం అహంకారం మనసుతో ఉన్నది సూక్ష్మ శరీరం.ఈ రెండు శరీరాలు ఉండడానికి కారణమే.. కారణ శరీరం. జీవుడిలో అజ్ఞానం ఉన్నంత వరకు స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయి.అజ్ఞానం తొలగిపోతే ఇవేమీ ఉండవు.జ్ఞానిగా మారిన జీవుడిలో నేను..నేనై ప్రకాశిస్తూ దేవుడై నిలుస్తున్నాడు కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)
English: Krishna .. This body is not me. I am not the same macro micro causal bodies. And .. Nenevarini .. Meat Shukla Hasti .. Bones is the gross body with all the senses. Pranam Buddhi Chittam Arrogance is the subtle body with the mind. The reason for the existence of these two bodies is the causal body. As long as there is ignorance in the living entity, there will be gross and subtle bodies. If ignorance is removed, there will be none._UdayKiran Golla(Bandarulanka)

prakash spiritual
తెలుగు: కృష్ణా..నేనెవరు..అనేది తెలుసుకునేది జ్ఞాని మాత్రమే.
English: Krishna..who knows..only a sage knows.
తెలుగు: కృష్ణా..నేనెవరు..అనేది తెలుసుకునేది జ్ఞాని మాత్రమే.జ్ఞాన ప్రకాశంతో వెలిగిపోయే జ్ఞానికి ఏ మలినం అంటుకోదు. సూర్యునికి మలినం అంటుతుందా. కొన్ని వస్తువులను నీటితో, మట్టితో కడిగితే మకిలిపోతుంది.కొంత సమయానికి మళ్ళీ మురుగు పడుతుంది. లోహాలను అగ్నిలో పుటం వేస్తే ధగధగ మెరిసి పోతాయి. కొంత కాలానికి మళ్ళీ మురికి పడుతుంది. వాక్యూమ్ క్లీనర్ వాయువుతో ఇంటిని శుభ్రం చేసుకున్నా మళ్ళీ మకిలి అంటుకుంటుంది. పంచ భూతాత్మకమైన సృష్టిలో గాలి నీరు అగ్ని భూమిలతో అసుద్ధమైన వాటిని శుద్ధం చేయవచ్చు. మళ్ళీ అసుద్ధం అవుతుంటాయి.కానీ ఏ రూపంలేని ఆకాశంతో దేన్నీ శుభ్రం చేయలేము.జీవుడు ఒకసారి జ్ఞానం పొందితే ఇక అజ్ఞానం అనేదే ఉండదు కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)

English: Krishna..who knows..only a sage knows. Does the sun feel dirty. Washing some objects with water and mud will cause staining. When metals are put on fire, they glow and burn. Will get dirty again for a while. If you clean the house with a vacuum cleaner gas, it will stick again. In the Pancha demonic creation air water can purify the impure with fire earths. They become impure again. But nothing can be cleansed with any formless sky._UdayKiran Golla(Bandarulanka)

prakash spiritual
తెలుగు: కృష్ణా..ఆత్మ కంటికి కనిపించదా.
English: Krishna .. the soul is invisible to the eye.

తెలుగు: కృష్ణా..ఆత్మ కంటికి కనిపించదా. జీవుని ఇంద్రియాలు బాహ్యా ప్రపంచంలో ఎన్నెన్నో గొప్ప పనులు చేస్తున్నాయి. అవేమీ ఆత్మను పట్టుకోలేక పోతున్నాయి. మనసు అయితే ఆత్మ దగ్గర వెలవెలబోతుంది.అటువంటి ఆత్మ గొప్పదా.. జీవుడిని సజీవంగా నిలిపే ప్రాణం గొప్పదా. జీవుడిలో ప్రాణం ఆడుతుంటేనే ఆలోచనలు పుడుతున్నాయి.. సంకల్ప వికల్పాలు కలుగుతున్నాయి. వివేకం విచక్షణ..నేను నాది ఇలా ఎన్నిటికో ప్రాణమే ఆధారం. అదే ప్రాణం ఆగిపోతే జీవుడిలో అన్నీ పడిపోతున్నాయి. లోకంలో ఈ దేహానికి విలువ కూడా లేకుండా పోతుంది.పోనీ ఆ ప్రాణం పోతూ పోతూ జీవుడిలోని బుద్ధి చిత్తం అహంకారం మనో బుద్ధులు అన్నిటినీ మూటకట్టుకుని బయట పడుతుంది. కానీ ఆ ప్రాణం మరో అద్దె ఇంటిని చూసుకుని వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ అన్నిటా శుద్ధ చైతన్యమై ప్రకాశిస్తుంది కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)
English: Krishna .. the soul is invisible to the eye. The senses of life are doing many great things in the external world. Awesome are unable to catch the soul. The mind, however, is going to be close to the soul. Is such a soul great? Is the life that keeps the living alive great? Thoughts arise when life is played in a living being .. Willful alternatives are formed. Wisdom and discernment..I am the basis of many lives like mine. If the same life stops, everything in the living being will fall. In the world this body loses even its value.As the pony goes on that life, the intellect of the living entity wraps up all the pride of the psychic Buddhas and takes them out. But that life goes on looking for another rental house. But God, does the soul shine with all its pure consciousness?_UdayKiran Golla(Bandarulanka)